గండిపేటలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై ప్రేమోన్మాది దాడి

గండిపేటలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై ప్రేమోన్మాది దాడి

ఎక్కడో ఓ చోట.. అమ్మాయిలపై దాడులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవాళ హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్‌లో దారుణం జరిగింది.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది.. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో.. ఆస్పత్రికి తరలించారు స్థానికులు. దాడికి పాల్పడిన ఉన్మాది ఓ ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తుండగా.. షారూక్ సులేమాన్‌గా గుర్తించారు పోలీసులు.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హైదర్ షాకోట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి నివాసం ఉంటోంది.. గత కొంతకాలంగా సులేమాన్.. ప్రేమపేరుతో ఆ యువతి వెంట పడుతున్నాడు.. ఆమె నిరాకరిస్తూ వస్తోంది. అయితే, ఇవాళ సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన యువతిని గమనించిన సులేమాన్.. నేరుగా యువతి ఇంటికి వెళ్లి.. కత్తితో దాడి చేశాడు.. ఇక, అడ్డుకునేందుకు యత్నించిన ఆ యువతి కుటుంబసభ్యులపై కూడా దాడికి పాల్పడ్డాడు.. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో.. స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు.