నేపాల్ లో పబ్ జీ గేమ్ నిషేదం

నేపాల్ లో పబ్ జీ గేమ్ నిషేదం

పాపుల‌ర్ మొబైల్ గేమ్ ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పబ్ జీ ని నేపాల్ ప్రభుత్వం నిషేదించింది. పిల్లల‌పై ఈ గేమ్ చెడు ప్రభావాన్ని చూపిస్తున్నందునే నిషేధించామ‌ని నేపాల్ టెలిక‌మ్యూనికేష‌న్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ తెలిపారు. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై నిన్న‌ నుంచే నిషేధం అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ఆ దేశానికి చెందిన ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ నుంచి అందిన విన్న‌ మేర‌కు నేపాల్‌లో ఉన్న అంద‌రు ఇంట‌ర్‌నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు, మొబైల్ ఆప‌రేట‌ర్లు, నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు ప‌బ్‌జి గేమ్ స్ట్రీమింగ్‌ను బ్లాక్ చేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ప‌బ్‌జి మొబైల్ గేమ్ వ‌ల్ల ఎలాంటి ప్ర‌ద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌న‌ప్ప‌కీ త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ చ‌దువులు, ఇత‌ర కార్యక‌లాపాల‌కు ఈ గేమ్ తీవ్రంగా ఆటంకం క‌లిగిస్తున్నద‌ని భావించినందునే నిషేధించామ‌ని ఆయన తెలిపారు.