ఎక్కువ పనిచేస్తే ఎక్కువ జీతం

ఎక్కువ పనిచేస్తే ఎక్కువ జీతం

పబ్లిక్ రంగ బ్యాకుల్లో సీనియర్ ఎంప్లాయిస్ ఇకపై ఎక్కువ పనిచేసి మరింత ఎక్కువ జీతాన్ని పొందవచ్చు. ఎస్బీఐ,పీఎన్బీ, బీఓబీ లాంటి ప్రభుత్వ బ్యాంకులు ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి.  ముఖ్యంగా జనరల్ మేనేజర్ గ్రేడ్ కంటే పై స్థాయి అధికారులకు పనితీరును బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని బ్యాంకులు సీరియస్ గా ఆలోచిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ అండ్‌ వేరియబుల్‌ పే మాదిరిగా ఇవి ఉంటాయి. అతి త్వరలో ఈ పద్దతి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో సునీల్‌ మెహతా చెప్పారు. 

సాధారణంగా పనితీరుని బట్టి వేతనాలు చెల్లింపు విధానం ప్రైవేటు రంగంలో ఉంటుంది. మంచి పనితీరు కనబరిస్తే మంచి ప్రోత్సాహకాలు అందిస్తారు. ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇలాంటివి చాలా తక్కువ. 2015లో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ యూనియనేతర సూపర్‌వైజర్లకు ఈ పనితీరు బట్టి చెల్లింపులు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇదే యోచనలో ఉన్నాయి. అయితే ఇందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది.