'అరవింద సమేత' టీమ్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారా ?

 'అరవింద సమేత' టీమ్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారా ?

కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ 'అరవింద సమేత' రఫ్ కాపీస్ నుండి కొన్ని పిక్స్ లీకై అందరికీ షాక్ ఇవ్వగా తాజాగా ఇంకొన్ని పిక్స్ కూడ బయటికొచ్చాయి.  ఇవి టీజర్ కు సంబందించిన ఫోటోలనే వాదన కూడ వినిపిస్తోంది.  టీజర్ విడుదల ఆగస్టు 15రోజున అని టీమ్ ప్రకటించి 24 గంటలు కూడ కాకముందే ఇలాంటి సమస్యలు తలెత్తడం విచారించాల్సిన విషయమే. 

ఇదిలా ఉండగా మరికొందరు ప్రేక్షకులు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, అయినా ఎడిటింగ్ టేబుల్ నుని ఇన్నిసార్లు ఫోటోలు బయటికొస్తుంటే ఆమాత్రం జాగ్రత్తలు తీసుకోలేరా, ఇక ముందు ఇలాంటివి చాలానే ఉంటాయని లైట్ తీస్కోండి అంటున్నారు.  మరి ఇది నిజంగా లీకేజ్ సమస్యేనా లేకపోతే కొందరంటున్నట్టు పబ్లిసిటీ స్టంటా అనేది యూనిట్ సభ్యులకే తెలియాలి.   హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.