ఏపీ సీఎం జగన్ సీపీఆర్వోగా పూడి శ్రీహరి

ఏపీ సీఎం జగన్ సీపీఆర్వోగా పూడి శ్రీహరి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్‌ పూడి శ్రీహరి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ నియామక ఉత్తర్వులను జారీ చేసింది. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీహరి, గడచిన 19 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. గత రెండేండ్లుగా వైఎస్‌ జగన్‌ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. 14 నెలలు పాటు 3,648 కిలోమీటర్లు సాగిన జగన్‌ సుదీర్ఘ పాదయాత్రలో తొలిరోజు నుంచి చివరి రోజు వరకూ కొనసాగారు. నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచార సేకరణ, అధ్యయనం, మీడియా వ్యవహారాల బాధ్యతలను గొప్పగా నిర్వహించారు. జగన్‌ రాజకీయ ప్రస్థానం, పాదయాత్రలను ప్రధాన అంశాలుగా చేసుకుని సమగ్ర వివరాలతో ‘‘అడుగడుగునా అంతరంగం’’ అనే పుస్తకం కూడా రాశారు. ఎన్నికలకు ముందు ఈ పుస్తకాన్ని జగన్‌ ఆవిష్కరించారు.