గవర్నర్ పై సీఎం తీవ్ర నిరసన 

గవర్నర్ పై సీఎం తీవ్ర నిరసన 

పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై ఆ రాష్ట్ర సీఎం వి.నారాయణసామి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కిరణ్ బేడి తీరుకు నిరసనగా..  సీఎం ఇంటి ఎదుట నల్లజెండా ఎగురవేశారు. లెఫ్ట్‌ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని వెంటనే రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు.  పుదుచ్చేరిలో ద్విచక్రవాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు ఇచ్చారు. తన ఆర్డర్స్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అధికారులకు కిరణ్ బేడీ సూచించారు. అయితే, ఇలాంటి ఆర్డర్స్‌‌ను దశలవారీగా అమలు చేయాలని, రాత్రికి రాత్రి సాధ్యం కాదని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి వాదిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయానికి వ్యతిరేకంగా  వి.నారాయణస్వామి ఆయన ఎదుట నల్లజెండాలను ఎగురవేశారు. రెండ్రోజుల క్రితం   కిరణ్ బేడీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆమె నివాసం (రాజ్‌భవన్) ఎదుట తన కేబినెట్ సహచరులతో కలసి నల్ల చొక్కాలు వేసుకుని ముఖ్యమంత్రి రోడ్డుపై బైఠాయించారు. ప్రతి విషయంలోనూ కిరణ్ బేడీ జోక్యం ఎక్కువ అయిపోతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడుతోంది. ఇప్పటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వద్ద 39 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని నారాయణస్వామి ట్వీట్  చేశారు. అందులో ముఖ్యమైన నిధులు, జీతాల చెల్లింపులు, ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన ఫైళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రోజువారీ విధుల్లో కూడా కిరణ్ బేడీ జోక్యం పెరిగిపోయిందని సీఎం విమర్శించారు.