మూడో వికెట్ కోల్పోయిన భారత్...

మూడో వికెట్ కోల్పోయిన భారత్...

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే నిన్న వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 62/2 తో నిలిచిన భారత్ నేడు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. దాంతో భారత్ ప్రస్తుతం 127/3 నిలిచింది. ఇక పుజారా పెవిలియన్ కు చేరుకున్న తర్వాత కెప్టెన్ రహానేతో కలిసి బ్యాటింగ్ చేయడానికి మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చాడు. అయితే భారత్ ఆసీస్ కంటే ఇంకా 242 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం రహానే(33), మయాంక్(12) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.