అడిలైడ్ టెస్ట్ లో పుజారా హాఫ్ సెంచరీ

అడిలైడ్ టెస్ట్ లో పుజారా హాఫ్ సెంచరీ

ఆస్ట్రేలియాతో అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా  తన కెరీర్‌లో 20వ హాఫ్ సెంచరీ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. 140 బంతుల్లో ఆరు ఫోర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
 
ఓవర్ నైట్ స్కోరు 151/3తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు పుజారా-రహానే జోడీ శుభారంభం ఇచ్చింది. పుజారాకు రహానే చక్కటి సహాకారం అందిస్తున్నాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు అజేయంగా 90 పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రస్తుతం భారత్ 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. పుజారా 71, రహానే 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 250 పరుగుల ఆధిక్యంలో ఉంది.