ఆ దారుణ ఘటన జరిగి సరిగ్గా ఏడాది... !!

ఆ దారుణ ఘటన జరిగి సరిగ్గా ఏడాది... !!

ఫిబ్రవరి 14 అంటే అందరికి గుర్తుకు వచ్చేది ప్రేమికుల రోజు.  ప్రపంచం మొత్తం ఈ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది.  ఇండియాలో కూడా దీనిని ప్రేమికులు ఓ వేడుకలా జరుపుకుంటారు.  అయితే, ఏడాది క్రితం ఇదే రోజున ఉదయం సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.  

ఆ ఘటనలో 40 మందికి పైగా ఆర్మీ జవానుకు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటనతో దేశం మొత్తం షాక్ అయ్యింది.  ఉగ్రవాదుల చర్యలను ముక్తకంఠంతో ఖండించాయి.  ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాలని ఆరోజున నిర్ణయం తీసుకున్నారు.  ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే, బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది.  ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని, చెట్లు, ఖాళీ ప్రదేశాల్లో బాంబుదాడులు చేశారని పాక్ బుకాయించినా, ఈ దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు హతమైనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. వందల సంఖ్యలో బాలాకోట్ లోని ఉగ్రస్థావరాల్లో ఉన్న ఉగ్రవాదులు మరణించారని అప్పట్లో న్యూస్ వచ్చింది.  పుల్వామా ఎటాక్ జరిగి ఏడాదైనా సందర్భంగా ఈరోజు ఆఘటనను గుర్తు చేసుకుందాం.  ఆ ఘటనలో అశువులు బాసిన ఇండియన్ ఆర్మీ జవానులకు నివాళులు అర్పిద్దాం.