ఈనెల 19న కర్ణాటక రాష్ట్ర బంద్

ఈనెల 19న కర్ణాటక రాష్ట్ర బంద్

పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా, అమరవీరులకు సంఘీభావంగా ఈనెల 19న కర్ణాటక రాష్ట్ర బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ నిర్వహించనున్నట్లు కన్నడ పోరాట పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వటల్ నాగరాజ్ తెలిపారు. బంద్ ను విజయవంతం చేయడం ద్వారా వీర సైనికులకు ఘన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేయాలని డిమాండ్ చేశారు. జమ్ముకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యావత్ దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది.