యువరత్న: 'పవర్ ఆఫ్ యూత్' ప్రోమో విడుదల

యువరత్న: 'పవర్ ఆఫ్ యూత్' ప్రోమో విడుదల

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి పలు మూవీస్ లో నటించారు. ‘బెట్టడహూవు’ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పునీత్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్, సయేషా సైగల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యువరత్న’ కన్నడ మూవీ రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రోమో వచ్చిన కొద్దీసమయంలోనే #PowerOfYouthPromo ట్రేండింగ్ లోకి వచ్చింది. తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటుంది యువరత్న.