నోసీఏఏ : అసెంబ్లీ తీర్మానం చేసిన పంజాబ్

నోసీఏఏ : అసెంబ్లీ తీర్మానం చేసిన పంజాబ్

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం రద్దు చేయాలని కోరుతూ ఈరోజు పంజాబ్ అసెంబ్లీ ఓ తీర్మాన్ని ప్రవేశపెట్టింది. పంజాబ్‌ మంత్రి బ్రహ్మ మోహీంద్ర ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ''కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, దేశ వ్యాప్తంగా అశాంతికి, నిరసనలకు కారణమైంది. స్వేచ్ఛా, సమానత్వంతో ఉన్న ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు వ్యతిరేకం. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించడంతో దేశంలోని కొన్ని వర్గాల భాష, సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉంది'' అని పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్మానంలో పేర్కొంది. అయితే నిజానికి కొన్ని రోజుల క్రితం పినరాయ్ విజయన్ నేతృత్వంలోని కేరళ సర్కార్ కూడా సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన రాష్ట్రాల్లో పంజాబ్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని రాష్ట్రాలలో ఇలా నిరసనలు చేస్తారో ?