ఇంట్లో 9..పడింది 5 ఓట్లు!

ఇంట్లో 9..పడింది 5 ఓట్లు!

లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే గెలిచిన ఏ అభ్యర్థుల ఇంట్లోనైనా పండుగ వాతావరణం ఉంటుంది. ఆటపాటలు, మిఠాయిలు పంచుకోవడం, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడం మామూలే. కానీ ఎన్నికల ఫలితాల కోలాహలంలో పంజాబ్ నుంచి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పంజాబ్ కి చెందిన ఈ వీడియోలో లోక్ సభ ఫలితాలు ప్రకటించగానే నీటూ షట్రావాలా అనే అభ్యర్థి బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. ఈ ఏడుపు సంతోషం పట్టలేకో లేదా ఓడిపోయాననే దుఃఖంతోనో కాదు. ఇది సొంత కుటుంబ సభ్యులు చేసిన గాయాల కారణంగా చేసిన రోదన. ఈ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తానెంతో కష్టపడినా తనకు కేవలం 5 ఓట్లు మాత్రమే వచ్చాయని వాపోయాడు.

తన కుటుంబంలో 9 మంది సభ్యులు ఉండగా తనకు 5 ఓట్లు మాత్రమే వచ్చాయని చెబుతూ ఇది కచ్చితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే జరిగిందని ఆరోపించాడు.