ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు ఆడిన 12 మ్యాచ్‌లలో 6 విజయాలతో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో సైతం తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ముంబై ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకోవాలని చూస్తుంది. అయితే ముంబై జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించినా.. మిగితా జట్లపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.

జట్లు:

పంజాబ్: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, అరోన్ ఫించ్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారీ, మార్కస్ స్టోనిస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, అండ్రూ టై, మోహిత్ శర్మ, అంకిత్ రాజ్‌పుత్.

ముంబై: సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లివీస్, రోహిత్ శర్మ, ఇశాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లాగాన్, మయాంక్ మార్ఖండే, జస్ప్రీత్ బుమ్రా.