టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండో మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మొహాలీలోని ఐఎస్‌ బింద్రా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలిసారి కెప్టెన్సీ చేస్తున్న పంజాబ్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌.. విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు.. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత సొంత జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ తరఫున బరిలోకి దిగుతున్న కెప్టెన్‌ గౌతం గంభీర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తమ జట్టు విదేశీ, స్వదేశీ ఆటగాళ్లతో సమతూకంగా ఉందన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌: లోకేష్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, యువరాజ్‌సింగ్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కస్‌ స్టాయినిస్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌: గౌతం గంభీర్‌, కొలిన్‌ మున్రో, రిషబ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, క్రిస్‌ మోరిస్‌, విజయ్‌శంకర్‌, డానియల్‌ క్రిస్టియన్‌, అమిత్‌ మిశ్రా, రాహుల్‌ తెవాటియా, ట్రెంట్‌ బౌల్ట్‌, మహ్మద్‌ షమీ