జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత పురందేశ్వరి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం తెగేసి చెప్పినా.. జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ తన తీరు మార్చుకోవాలని.. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని అన్నారు. ఏపీలో ప్రారంభంకానున్న గ్రామ సచివాలయ విధానంపైనా విమర్శలు చేశారు పురంధేశ్వరి. ఎటువంటి విధానాలు అమలు చేసినా..  రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.  ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.