అది నా అదృష్టం: పురంధేశ్వరి

అది నా అదృష్టం: పురంధేశ్వరి

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన కుమార్తెగా పుట్టడం తన అదృష్టమని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాట పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ 96వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఇవాళ ఉదయం పురంధేశ్వరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజున రాజాకీయలు మాట్లాడబోనని స్పష్టం చేశారు. అంతకముందు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.