సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన పూరి

సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన పూరి

పూరి జగన్నాధ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రచార దృశ్యాలు ఆకట్టుకున్నాయి.  ఇస్మార్ట్ గా సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో సినిమాపై నమ్మకం ఏర్పడింది. రామ్ ఈ సినిమాలో చాలా ఎనేర్జిటిక్ గా కనిపించాడు.  అలాగే నభా నటేష్, నిధి అగర్వాల్ లను కూడా అందంగా చూపించాడు.  

పూరి కనెక్ట్ పతాకంపై ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఈ మూవీ స్క్రిప్ట్  బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి లీక్ చేశాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. . దీనిని తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.