`నో` చెప్పగలిగేవాడే పవర్‌ఫుల్ : పూరీజగన్నాద్

`నో` చెప్పగలిగేవాడే పవర్‌ఫుల్ : పూరీజగన్నాద్

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ గురించి తెలియని సినీప్రేమికులు ఉండరేమో.తనదైన మార్క్ తో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాప్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు పూరి. నేడు పూరి పుట్టిన రోజు. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక పూరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.  తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'నో' చెప్పగలిగేవాడే పవర్ ఫుల్ అని చెప్పుకొచ్చారు. 'నో` చెప్పడం ఎలాగో అందరూ నేర్చుకోవాలని, అన్నింటికీ `ఎస్` చెప్పడం వల్ల నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డానని పూరీ జగన్నాథ్ తెలిపారు. 'నో' చెప్పడం జీవితంలో  చాలా ముఖ్యమైన విషయం. ఎదుటి వ్యక్తి అడిగిన ప్రతిదానికి 'ఎస్' చెప్పుకుంటూ పోతే కష్టాలు తప్పవు. ప్రతిదానికి 'ఎస్ ' చెబితే మీరు చులకనైపోతారు. 'నో' చెప్పిన ప్రతిసారి మీరు చాలా సంతోషంగా ఫీలవుతారు.' నో' చెప్పిన వాడే సక్సెస్‌ అయినట్లు లెక్క. ముందు 'నో' చెప్పండి, లేదా సమయం కావాలని అడగండి. అన్నింటికీ అప్పుడే, అక్కడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించిన తర్వాత కూడా.. నచ్చకపోతే 'నో' చెప్పండి. అంటూ పూరి చెప్పుకొచ్చారు.