పూరి తర్వాతి సినిమా నాగ్ తోనేనా...?

పూరి తర్వాతి సినిమా నాగ్ తోనేనా...?

వరుస అపజయాలతో ఉన్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గత ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’తో మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు పూరి. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పూరి స్టార్ హీరో నాగార్జునతో సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. ఈ కరోనా లాక్ డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఆ సమయం లో తాను ఓ కథ రాస్తున్నట్లు పూరి అప్పుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పూరి చెప్పాడు. ఇక ఆ రాసిన కొత్త కథ నాగ్ కోసమే అని ప్రచారం జరుగుతుంది. ఇంతకముందు వీరి కాంబినేషన్‌లో ‘శివ మణి, సూపర్' అనే సినిమాలు వచ్చాయి. అయితే అవి అంతగా ఆడలేదు. కానీ ఇప్పుడు వచ్చే సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది అని ఈ ఇద్దరు స్టార్స్ బలంగా నమ్ముతున్నారట! అయితే గత ఏడాది మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం అహిషోర్ సోలొమన్ దర్శకత్వం లో  వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. పూరి ఫైటర్, నాగ్ వైల్డ్ డాగ్ పూర్తయిన తర్వాత వీరి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని సమాచారం.