జగన్‌ను తెగ పొగిడిన పూరి !

జగన్‌ను తెగ పొగిడిన పూరి !

దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ ఈసారి ఎన్నికలో వైకాపా తరపున నర్సీపట్నం నుండి పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.  తన తమ్ముడికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు పూరి జగన్ మీద ప్రశంసలు కురిపించారు.  ఎన్నికల్లో గెలిచిన జగన్ మొత్తానికి రాజన్న కొడుకని అనిపించుకున్నాడని అంటూ గెలిచిన తర్వాత అతని ముఖంలో విజయ గర్వం లేదని, కేవలం కత్తిపోట్లు, ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు గుర్తున్నాయని అన్నారు.  అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా తన తమ్ముడికి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించిన జగన్‌కు తన కుటుంబం రుణపడి ఉంటుందని అన్నారు.