మరోసారి ఆ యంగ్ హీరోతో పూరి .?

మరోసారి ఆ యంగ్ హీరోతో పూరి  .?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ ఖాళీగా ఉండకుండా ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసినట్లు తెలుస్తోంది.పూరి జగన్నాధ్ కు వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ కు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్ దక్కిన విషయం తెల్సిందే.ఇస్మార్ట్ సక్సెస్ తో వీరిద్దరు కూడా చాలా జోరుమీదున్నారు.ఇదే సమయంలో వీరిద్దరి కాంబో మూవీ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రామ్ కోసం పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడంటూ సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు రామ్ తో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడట. మరి మరోసారి ఇస్మార్ట్ మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో  చూడాలి.