పూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ

 పూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత రెండు మూడేళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఎంట్రీ  జరగలేదు.  దీనికి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన తరువాత మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఎవరి దర్శకత్వంలో ఎంట్రీ సినిమా ఉంటుంది అనే దానిపై కూడా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.  వివివినాయక్, బోయపాటి వంటి పేర్లు వినిపిస్తున్నా.. పూరి వైపుకే బాలయ్య మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది.  

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను చిరుత సినిమాకు పూరి దర్శకత్వం వహించారు.  ఎంట్రీ అద్భుతంగా ఉండటంతో.. చరణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లిస్ట్ లో ఉన్నాడు.  మోక్షజ్ఞను కూడా పూరితో లాంచ్ చేయిస్తే.. బాగుంటుందని బాలయ్య అభిప్రాయం.  పూరి మేకింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  బాలయ్యతో పైసా వసూల్ చేశాడు.  అటు ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు.  మరి వీరిలాగే మోక్షజ్ఞకు కూడా పూరి టర్నింగ్ పాయింట్ ఇచ్చే సినిమా చేస్తాడేమో చూడాలి.