దేవరకొండతో పూరి జగన్నాథ్ సినిమా ?

దేవరకొండతో పూరి జగన్నాథ్ సినిమా ?

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు.  అలాంటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ పేరు కూడ వినిపిస్తోంది.  చివరిగా 'మెహబూబా' సినిమాతో పలకరించిన పూరి ప్రస్తుతం ఏ హీరోతోనూ సినిమా చేయడంలేదు.  

ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ఆయన దేవరకొండలో సినిమా చేయాలనుకుంటున్నారని, ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది.  మరి వీరిద్దరి క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.  ప్రస్తుతం విజయ్ 'టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్' వంటి సినిమాలు చేస్తూనే ఇంకొన్ని కొత్త సినిమాలను ఒప్పుకుని ఉన్నారు.