పూరి లైన్లో పడ్డాడు.. ప్రూఫ్ ఇదే..!!

పూరి లైన్లో పడ్డాడు.. ప్రూఫ్ ఇదే..!!

పూరి జగన్నాథ్ సినిమాలు గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి.  ఒక్క సినిమా కూడా హిట్ కావడంలేదు..   దీంతో పూరి పని అయిపోయిందని వార్తలు వచ్చాయి.  దాని నుంచి గట్టేందుకు పూరి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.  అయినా అనుకున్న విజయం అందుకోలేకపోవడం విశేషం .  

తాజాగా పూరి తన స్థాయికి తగ్గ విజయం అందుకున్నాడని అర్ధం అవుతున్నది.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పూరి ఓ కొత్త స్టోరీని డిజైన్ చేసుకొని సినిమా ప్లాన్ చేశారు.  పూరి ప్లాన్ వర్కౌట్ అయినట్టే కనిపించింది.  ఫస్ట్ డే రోజున మంచి వసూళ్లు సాధించింది.  మొదటి రోజు ఈ సినిమా రూ. 7.83 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి వావ్ అనిపించింది.  ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని అసలు ఎవరూ అనుకోలేదు.  పూరి సినిమా నైజాం పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది.  మొదటి రోజు నైజాంలో రూ. 3.43 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సాధించింది.  దీన్ని బట్టి చూస్తే.. పూరి మళ్ళా లైన్లోకి వచ్చాడని అర్ధం అవుతున్నది. 

ఏరియాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. 

ఏరియ    కలెక్షన్స్
నైజాం -   3.43 కోట్లు
సీడెడ్  -   1.20 కోట్లు
వైజాగ్ -    0.86 కోట్లు
ఈస్ట్  -  0.50 కోట్లు
వెస్ట్ -   0.40 కోట్లు
కృష్ణ -  0.53 కోట్లు
గుంటూరు -   0.57 కోట్లు
నెల్లూరు -   0.30 కోట్లు
మొత్తం -   7.83 కోట్లు