అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు బాలకృష్ణ.. పూరి మ్యాజిక్ చేస్తాడా?

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు బాలకృష్ణ.. పూరి మ్యాజిక్ చేస్తాడా?

మాస్ ను మెప్పించాలన్నా.. వైన్ లా కిక్కెక్కించాలన్నా దానికి పూరీనే సమర్ధుడు.  దీనిని అనేకసార్లు రుజువు చేసుకున్నాడు దర్శకుడు పూరి.  గతంలో ఒకరి రెండు ఫెయిల్యూర్స్ వస్తే ఆ తరువాత తప్పకుండా భారీ హిట్టిచ్చేవాడు.  కానీ, మంచి హిట్ అందుకోవడానికి పూరికి చాలా సమయం పట్టింది.  

ఎన్టీఆర్ టెంపర్ తరువాత పూరికి సరైన హిట్ లేదు.  హీరోలను ఎనర్జిటిక్ గా చూపిస్తున్నారుగాని, హిట్ ను ఇవ్వలేకపోతున్నారు.  బాలకృష్ణ పైసా వసూల్ కూడా అంతే.  పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుంది అంటే అలా మరో దర్శకుడు డీల్ చేయలేకపోయారు.  పూరి నెక్స్ట్ సినిమా బాలయ్యతో చేయడానికి రెడీగా ఉన్నారు.  కథ కూడా రెడీ చేసుకున్నారు.  బాలకృష్ణ కండిషన్స్ పెట్టిన సంగతి తెలిసిందే.  ఇస్మార్ట్ హిట్టయితేనే సినిమా అన్నారు.  

అనుకున్నట్టుగానే ఛోడ్ చింతా.. మార్ ముంతా అయ్యింది.  అయితే బాలయ్య సినిమా ఎప్పుడు ఉంటుంది అన్నది త్వరలోనే తెలుస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా సినిమా తీసి ఫెయిల్ అయ్యిన పూరి, టెంపర్ తో బంపర్ హిట్ ఇచ్చారు.  అలానే పైసా వసూల్ తో ఫెయిల్ అయినా.. కొత్త సినిమాతో తప్పకుండా హిట్ ఇవ్వాలని పూరి గట్టి పట్టుదలతో ఉన్నాడట.