కారులోనే ఎన్టీఆర్ షికారు..!!

కారులోనే ఎన్టీఆర్ షికారు..!!

ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఉంటుంది.  ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేరు.  స్వీట్స్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది.  ప్రయాణాలు చేయడం అంటే కొందరికి ఆసక్తి.. బైక్ రైడింగ్.. కారు డ్రైవింగ్ ఇలా సపరేట్ గా ఉంటాయి.  ఎన్టీఆర్ కు కూడా ఓ ఆసక్తి ఉన్నది.  అదే కారు డ్రైవింగ్.  

షూటింగ్ కు వెళ్లే సమయంలో సొంతంగానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు.  ఎన్టీఆర్ కారు డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. మేఘాలలో తేలిపొమ్మన్నది అన్నటుగా ఉంటుందట.  ఈ విషయాన్ని గతంలో జెడి చక్రవర్తి చెప్పిన సంగతి తెలిసిందే.  ఇలాంటి అనుభవాన్నే పూరి కూడా పేస్ చేశాడు.  అదెలా అంటే.. టెంపర్ షూటింగ్ గోవాలో జరిగే సమయంలో ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ కు పూరి కారులోనే వెళ్లేవారట. ఎన్టీఆర్ కారు స్టార్ట్ చేస్తే మినిమమ్ 100 స్పీడ్ తో వెళ్లాల్సిందే. లేదంటే అసలు డ్రైవింగ్ చేసిన అనుభూతి రాదనీ ఎన్టీఆర్ చెప్పినట్టు పూరి తెలిపాడు.