ఇస్మార్ట్ రామ్ కు మరో బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్న పూరి..!!

ఇస్మార్ట్ రామ్ కు మరో బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్న పూరి..!!

రామ్ హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. అరడజను సినిమాలకు పైగా ప్లాపైనా తరువాత.. పూరి హిట్ కొట్టిన మూవీ ఇది.  కేవలం 12 రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ 35కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.  

నిర్మాతలైన పూరి, ఛార్మీలకు బోలెడు లాభాలు తెచ్చిపెట్టాయి.  భారీగా లాభాలు రావడంతో అందులోని కొంతవాటాను రామ్ కు ఇవ్వాలని అనుకున్నాడట పూరి.  సినిమా రిలీజ్ సమయంలో రామ్ విదేశాలకు వెళ్ళాడు.   రీసెంట్ గా తిరిగి వచ్చారు. త్వరలోనే రామ్ ను కలిసి కొంతమొత్తాన్ని రామ్ కు ఇవ్వాలని నిర్మాతలు పూరి, ఛార్మీలు నిర్ణయించుకున్నారు.  దీంతో పాటు ఓ భారీ సక్సెస్ మీట్  ను కూడా ఏర్పాటు చేయబోతున్నారట.