ఆ మూడు సినిమాల బాటలో అంటున్న పూరి..!!

ఆ మూడు సినిమాల బాటలో అంటున్న పూరి..!!

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సెన్సర్ కార్యక్రమాలను నిన్న పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఏ సర్టిఫికెట్ వస్తుంది అంటే కొంతంది దర్శక నిర్మాతలు భయపడతారు.  ఎందుకంటే ఆ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో అనుకుంటారు.  

గతంలో పూరి దర్శకత్వం వహించిన దేశముదురు, పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు కూడా ఏ సర్టిఫికెట్ పొందాయి.  ఈ మూడు సినిమాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఇదే బాటలో ఇస్మార్ట్ శంకర్ కూడా హిట్టవుతుందని పూరి విశ్వసిస్తున్నాడు.  మరి పూరి నమ్మకం నిజమౌతుందా చూద్దాం.