డార్లింగ్ ను కాకా పడుతున్న పూరి..!!

డార్లింగ్ ను కాకా పడుతున్న పూరి..!!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి తిరిగి లైన్లోకి వచ్చాడు.  అనుకున్న దానికంటే సినిమా మంచి విజయం సాధించింది.  రామ్ కెరీర్లో ఇది భారీ హిట్.  తన దర్శకత్వానికి డోకా లేదని, తన కలంలో పదును తగ్గలేదని పూరి నిరూపించారు.  ఈ సినిమా హిట్ తరువాత పూరి అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నారు.  

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  పూరి సినిమా అంటే అలా మొదలయ్యి.. ఇలా ఎండ్ అవుతుంది.  షూటింగ్ లో చాలా స్పీడ్ ను ప్రదర్శిస్తారు.  ఎంత పెద్ద హీరోతో సినిమా అయినప్పటికీ తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేయడం విశేషం.  మహేష్ పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలను కేవలం 100 రోజుల్లోపే ముగించేశాడు.  ఇప్పుడు పూరి .. ప్రభాస్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  పూరి.. ప్రభాస్ కాంబినషన్లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయి.  బుజ్జిగాడు పర్వాలేదు.  ఏక్ నిరంజన్ ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశను మిగిల్చింది.  కాగా, ఇటీవలే ప్రభాస్ ను కలిసి ఓ కథ చెప్పాడట పూరి.  పూరి లైన్ ప్రభాస్ కు బాగా నచ్చింది.  దీంతో ప్రభాస్ కు పూర్తి స్క్రిప్ట్ ను నరేట్ చేసి ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు.  ఒకవేళ ప్రభాస్ ఒకే అంటే.. ప్రభాస్ ను తగ్గట్టుగా పాన్ ఇండియామూవీని సెట్ చేస్తారేమో చూడాలి.