ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా పురందేశ్వరి

ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా పురందేశ్వరి

ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా బీజేపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ రంగ విమానసంస్థ అయిన ఎయిర్ ఇండియాలో మూడేళ్ల పాటు పురందేశ్వరి స్వతంత్ర హోదా కలిగిన డైరెక్టర్‌ పదవిలో ఆమె కొనసాగనున్నారు. పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో.. డీవోపీటీ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. దగ్గుబాటి పురందేశ్వరి యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో బీజేపీలో చేరి.. పార్టీలో కీలకంగా మారారు. దీంతో పార్టీలో సముచిత స్థానం కల్పించి.. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆమెకు ఈ పదవి దక్కడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.