పుష్పరాజ్‌కు కాశీ, వారణాసిలో పని ఏంటి..

పుష్పరాజ్‌కు కాశీ, వారణాసిలో పని ఏంటి..

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో పుష్ప కూడా ఒకటి. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అంతేకాకుండా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్దం కానుంది. దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రి పరిసరాల్లోని మారేడుపల్లి అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి నుంచి అల్లు అర్జున్ ఫొటోలు వచ్చని విషయం తెలిసిందే. రాజమండ్రిలో షెడ్యూల్ పూర్తయిన తరువాత చిత్ర బృందం తన తరువాతి షెడ్యూల్ కోసం వారణాసి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 18 నుంచి మొదలు కానుంది. మరి ఎర్ర చందనం తరలించుకునే పుష్పరాజ్‌కు వారణాసిలో ఏం పని అనేది తేలాలి. అసలు వారణాసి, కాశీ కనెక్షన్ ఏంటనేది సుకుమారే వివరించాలి. వారణాసిలో ఓ పాట చిత్రీకరణ కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నో సార్లు షూటింగ్ వాయిదాలు పడటంతో సినిమాను శరవేగంతో పూర్తి చేసేందుకు సుకుమాన్ ప్లాన్ చేస్తున్నాడు.