పుష్ప స్పెషల్ అప్‌డేట్ వచ్చేది అప్పుడేనా..?

పుష్ప స్పెషల్ అప్‌డేట్ వచ్చేది అప్పుడేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా చేస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు సినిమాపైన అంచనాలను మరింత అదికం చేశాయి. ఈ సినిమాను ఆగస్ట్13న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ విడుదల హాట్ టాపిక్‌గా ఉంది. టీజర్ ఎప్పడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా టీజర్ గురించి సినీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమా టీజర్‌ను పుష్ప మేకర్స్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్8న విడుదల చేయనున్నారంటూ టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్‌పై క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.