'పుష్పక విమానం'లో ఆనంద్ దేవరకొండ!

'పుష్పక విమానం'లో ఆనంద్ దేవరకొండ!

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తనయుడు ఆనంద్ దేవరకొండ సైతం తనదైన శైలిలో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తొలి చిత్రం 'దొరసాని'తో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న ఆనంద్... మలి చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో కమర్షియల్ సక్సెస్ నూ అందుకున్నాడు. ఇక అతని మూడో సినిమా పేరునూ తాజా ప్రకటించారు. ఫార్ట్ ఫిలిమ్ మేకర్ దామోదర అట్టాడ దర్శకత్వంలో విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి గోవర్థన్ రావ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పుష్పక విమానం' అనే పేరు ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ లోగో పోస్టర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. మరో విశేషం ఏమంటే.. ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీకి అతను సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో  అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు. గతంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సైలెంట్ మూవీ 'పుష్పక విమానం' వినోదాల జల్లు కురిపించి, భారతీయ సినిమా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మరి ఈ 'పుష్పక విమానం' ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.