రెండు తెలుగు రాష్ట్రాలకు భారత స్టార్ షట్లర్ విరాళం...

రెండు తెలుగు రాష్ట్రాలకు భారత స్టార్ షట్లర్ విరాళం...

ప్రపంచ దేశాలు అని ఇప్పుడు కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నాయి. అయితే ఈ వైరస్ ప్రభావం మన భారత్ లో బాగానే కనిపిస్తుంది. అయితే కరోనా తో పోరాడటానికి సెలబ్రెటీలు అందరూ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలోకి వచ్చింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షలు విరాళం ప్రకటించింది. ఈ విషయానికి సంబంధించిన పోస్ట్ ను తన అధికారిక ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేసింది సింధు. అయితే కరోనా కారణంగా ఒలంపిక్స్ తో సహా అని అంతర్జాతీయ క్రీడలు వాయిదా పడ్డాయి. అయితే ఈ సంవత్సరం జులై లో ప్రారంభం కావాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే ఒలంపిక్స్ లో ఆడాలంటే అంతర్జాతీయ స్థానాల్లో కేవలం మొదటి 16 స్థానాల్లో ఉన్న వారు మాత్రమే అర్హత సాధిస్తారు. అయితే పి.వి. సింధు ప్రస్తుతం ఆరో స్థానం లో కొనసాగుతుంది. కానీ ఒలంపిక్స్ కు ఇంకా ఏడాది పాటు సమయం ఉండటంతో తన స్థానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని చూస్తుంది. అయితే మరో షట్లర్ సైనా ప్రస్తుతం 20 వ స్థానం లో ఉంది కాబట్టి ఒలింపిక్స్‌కు వేళలంటే ఇంకో 4 స్థానాలు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.