చరిత్ర సృష్టించిన పీవీ సింధు !    

 చరిత్ర సృష్టించిన పీవీ సింధు !    

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో భారత ఏస్ షట్లర్, పీవీ సింధు భారీ విజయం సొంతం చేసుకుంది. తొలి గేమ్ లో ఒకుహారా (జపాన్)పై 21-7 తేడాతో అలవోకగా గెలిచిన సింధు రెండో గేమ్లో 21-7 తేడాతో వరస సెట్లను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డులకెక్కింది. ఫస్ట్‌ సెట్‌లో కేవలం ఏడు పాయింట్లు మాత్రమే కోల్పయిన ఆమె పదునైన స్మాష్‌ షాట్లతో, సూపర్‌ ర్యాలీలతో ఒకుహారకు చుక్కలు చూపించింది సింధు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో గతంలో రెండు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గడంలో విఫలమైన సింధు మూడో ప్రయత్నంలో మాత్రం విజయకేతనం ఎగురవేసింది.