తల్లికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన పీవీ సింధు...ప్రశంసలు జల్లు

తల్లికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన పీవీ సింధు...ప్రశంసలు జల్లు

 

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా పీవీ సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పీవీ సింధు ఇంట్లో సంబరాలు చేసుకున్నారు. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబ సభ్యులు టీవీలో మ్యా్చ్‌ వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లి విజయ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ కోసం సింధు తీవ్రస్థాయిలో సాధన చేసిందని అన్నారు.

అయితే సరిగ్గా తన తల్లి విజయ పుట్టినరోజు నాడే సింధు ఈ ఘనత సాధించడం కాకతాళీయం అనే చెప్పాలి. అలా తన తల్లికి సింధు మరువలేని కానుక ఇచ్చినట్టయింది. ఇక సింధు విజయం నేపధ్యంలో ఆమె మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ నరసింహన్,  ఏసీ సీఎం జగన్ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే హరీశ్ రావు, టీడీపీ యువనేత నారా లోకేశ్ అలాగే క్రీడా, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.