సెమీస్‌లో సింధు ఓటమి

సెమీస్‌లో సింధు ఓటమి

మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరు ముగిసింది. ఈ రోజు​జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో సింధు 15-21, 21-19, 11-21 తేడాతో వరల్డ్ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో అతికష్టంగానే పోరాడి  గెలిచింది. అయితే నిర‍్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పదే పదే పొరపాట్లు చేయడంతో తై జు యింగ్‌ సునాయాసంగా గేమ్‌ను గెలుచుకుంది. దీంతో జూ ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తై జు యింగ్‌పై సింధుకు తొమ్మిదో ఓటమి.