స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి...

స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి...

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు నిరాశ పరిచింది. స్పెయిన్‌కు చెందిన క్రీడాకారిణి కరోలినా మారిన్‌ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో 12-21, 5-21 తేడాతో మ్యాచ్‌ ను కోల్పోయింది. 35 నిమిషాల్లోనే ఆట ముగిసింది. మారిన్‌ చేతిలో సింధుకు ఇది మూడో ఓటమి. దాదాపు 18 నెలల తర్వాత సింధు తొలిసారి ఫైనల్‌ ఆడగా.. మారిన్‌ ఇదే ఏడాదిలో మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. సింధు తర్వాత మార్చి 17 నుంచి 21 వరకు జరిగే ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొననుంది. చూడాలి మరి ఈ టోర్నీలో పీపీ సింధు ఏం చేస్తుంది అనేది.