కమల్ హాసన్‌తో పీవీ సింధు భేటీ.. అక్కడే లంచ్..

కమల్ హాసన్‌తో పీవీ సింధు భేటీ.. అక్కడే లంచ్..

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చెన్నైలో ప్రముఖ సినీనటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్‌తో సమావేశమయ్యారు.. చెన్నైలోని ఎంఎన్‌ఎం పార్టీ ఆఫీసుకు వెళ్లిన ఆమె... కమల్ హాసన్‌తో కలిసి అక్కడే లంచ్ చేశారు. అయితే, కమల్ పార్టీ కార్యాలయానికి సింధు వెళ్లడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతున్నారు కమల్ సన్నిహితులు. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారంటూ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు కమల్. ఇక, 2020లో టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు పీవీ సింధూ.. దాని కోసం నిత్యం సాధన చేస్తానని తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీకి సింధుతో పాటు ఆమె తల్లికూడా వచ్చారు.