ఫైనల్లో ఆడుతున్నట్టు అనిపించలేదు.. పీవీ సింధు

ఫైనల్లో ఆడుతున్నట్టు అనిపించలేదు.. పీవీ సింధు

వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పీవీ సింధు ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహురా పై 21-7, 21-7 తేడాతో విజయం సాధించి స్వర్ణపతకం గెలుచుకుంది.  వరసగా మూడు సార్లు ఈ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీకి వెళ్లిన సింధు.. గతంలో రెండుసార్లు ఓటమిపాలైంది.  ఈసారి పట్టుదలతో ఆడి స్వర్ణపతకం గెలుచుకుంది పీవీ సింధు.  

ఛాంపియన్ షిప్ పోటీల్లో విజయం సాధించి ఇండియాకు తిరిగి వచ్చిన సింధుకు హైదరాబాద్ లో ఘనస్వాగతం లభించింది.  హైదరాబాద్ వచ్చిన తరువాత సింధు గోపిచంద్ అకాడెమీలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నది.  ఫైనల్ లో ఆడుతున్నట్టుగా ఫీల్ కాలేదని.. మాములు క్వార్టర్, సెమిస్ ఆడినట్టుగానే గేమ్ ఆడానని, స్ట్రెస్ ఫీల్ కాలేదని చెప్పింది.  ఫస్ట్ నుంచి గేమ్ ను లీడ్ లోకి తీసుకురావడం మ్యాచ్ గెలిచినట్టు చెప్పింది పీవీ సింధు.  కోచ్ గోపీచంద్ నుంచి ప్రతి ఒక్కరు చాలా చక్కగా సహకరించారని చెప్పింది పీవీ సింధు.