కొండారెడ్డి బురుజు దగ్గర కరోనా రక్కసి...

కొండారెడ్డి బురుజు దగ్గర కరోనా రక్కసి...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకు దేశాలు గడగడలాడుతున్నాయి. ఈ  తరుణం లో  కొందరు దర్శకులు కరోనాపై సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.   ఇప్పటికే కరోనాపై రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కరోనా పై ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. 

తాజాగా ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'వాస్తవ సంఘటనల ఆధారంగా' అనే స్లైడ్ మొదట్లోనూ.. 'కరోనా అనేది ఆరంభం మాత్రమే' అనే స్లైడ్ చివర్లోనూ చూపించారు. సెంటర్లో ఉన్న ఓ విగ్రహం.. రెడ్ సిగ్నల్ చూపిస్తూ నెమ్మదిగా కొండారెడ్డి బురుజు రివీల్ చేస్తారు.  కింద రోడ్డు మీద కొన్ని శవాలు పడి ఉంటాయి. పెద్ద రాక్షసి నోరు తెరిచినట్టు .. ఈ పోస్టర్ లో చూపించారు.