మహేష్ సినిమాలో ఇద్దరు కాదు.. ముగ్గురున్నారు..!!

మహేష్ సినిమాలో ఇద్దరు కాదు.. ముగ్గురున్నారు..!!

మహేష్ బాబు 25 వ సినిమా లోగోను మహేష్ కూతురు సితార విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఈ ప్రస్తుతం ఈ లోగో పేరుమీదుగానే సినిమా షూటింగ్ జరుగుతుంది.  సినిమా పేరు ఏంటి అనే విషయం మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చేలా లేదు.  ఈ సినిమా లోగోతో పాటు పైన ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరం కూడా ఉన్నది.  దాని కింద ఏ రిమార్కబుల్ జర్నీ అనే టైటిల్ ఉన్నది.  ఆర్ అక్షరంపైన సెలెబ్రేటింగ్ 25 ఫిలిమ్స్ అని ఉన్నది.  ఇంతవరకు బాగానే ఉంది.  

ఇక్కడే అసలు విషయం బయటపడింది.  ఇప్పటి వరకు ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు అనుకున్నాం.  కాదని ఇప్పుడు తేలిపోయింది.  ఈ ఇద్దరితో పాటు పివిపి సినిమా కూడా భాగస్వామ్యం అయిందని ఈ పోస్టర్ తో తేలిపోయింది.  పోస్టర్ పైన ఈ ముగ్గురు నిర్మాతలకు సంబంధించిన మూడు బ్యానర్లను ముద్రించారు.  దీంతో ముగ్గురు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తేలిపోయింది.  

మహేష్ బాబు 25 వ సినిమాను పివిపి బ్యానర్లోనే చేయాలి.  వంశి పైడిపల్లి ఆ బ్యానర్లోనే కథను రెడీ చేసుకున్నారు.  కొన్ని కారణాల వలన అక్కడి నుంచి బయటకు రావడం, దిల్ రాజు, అశ్వినీదత్ బ్యానర్లో సినిమా ప్రారంభం కావడం జరిగింది.  ఈ విషయంపై కోర్టులో కేసు వరకు వెళ్ళాడు పొట్లూరి ప్రసాద్.  మహేష్ బాబు కల్పించుకొని సెటిల్ చేయడంతో.. పివిపి కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యారట.  ఒకే సినిమాను ముగ్గురు ప్రముఖ నిర్మాతలు కలిసి నిర్మించడం నిజంగా అభినందించదగిన విషయమే.  మరి ఈ సినిమా వారికి ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.