క్వీన్ ను నడిపించేది వర్మనే..

క్వీన్ ను నడిపించేది వర్మనే..

బాలీవుడ్ లో విడుదలయ్యి సంచనలం సృష్టించిన క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు.  దక్షిణాదిలో మిగతా భాషల్లో ఎలా ఉన్నా.. తెలుగు రీమేక్ ఎవరు చేస్తున్నారు అనే దానిగురించి అందరు మాట్లాడుకుంటున్నారు.  తెలుగులో 'అ' అనే వినూత్నమైన సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మకు తెలుగు రీమేక్ అవకాశం దక్కింది.  మొదట ఈ సినిమాకు నీలకంఠ ను దర్శకుడిగా అనుకున్నారు.   క్వీన్ రీమేక్ పోస్టర్ లో కూడా నీలకంఠ పేరునే వేశారు. 

జాతీయ అవార్డును పొందిన నీలకంఠకు గత కొంతకాలంగా హిట్ లేకపోవడంతో ఆయనను పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది.  ఆ స్థానంలో ప్రశాంత్ వర్మను తీసుకున్నట్టు సమాచారం.  వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ క్వీన్ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురియడమే కాకుండా కంగనా రనౌత్ కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.  ఇక తెలుగులో కంగనా రోల్ ను మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పోషిస్తుంటే.. తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.  మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు క్వీన్ రోల్ ను ప్లే చేస్తున్నారు.