లాక్ డౌన్ తర్వాత నెట్స్‌లో శిక్షణ ప్రారంభించిన మొదటి భారత ఆటగాడు...

లాక్ డౌన్ తర్వాత నెట్స్‌లో శిక్షణ ప్రారంభించిన మొదటి భారత ఆటగాడు...

ప్రపంచ కప్ విజేత ఇండియా ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ మార్గదర్శకాలలో సడలింపు తరువాత చెన్నైలోని సమీపంలోని శిక్షణా కేంద్రంలో నెట్స్‌లో తన శిక్షణ ప్రారంభించిన మొదటి భారత ఆటగాడు. అయితే లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి భారత ఆటగాళ్లు ఎవరు బయటికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే చాల మంది ఇంట్లోనే ఉంటూ తమ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టరు. అయితే ఇప్పుడు మొదటిసారిగా అశ్విన్ బయటకు వచ్చి తన శిక్షణ ప్రారంభించాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న క్లిప్‌ను ఆర్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. "ఒక సమయంలో ఒక అడుగు !!! బేబీ స్టెప్స్," అని అశ్విన్ తన పోస్ట్ కు క్యాప్షన్ పెట్టాడు. అయితే ప్రయాణ ఆంక్షలు అమలయ్యే వరకు ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు ఉండవు అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపాడు.