లాక్ డౌన్ కారణంగా బాధలు పడుతున్న రవిచంద్రన్ అశ్విన్...

లాక్ డౌన్ కారణంగా బాధలు పడుతున్న రవిచంద్రన్ అశ్విన్...

కరోనా కారణంగా రవిచంద్రన్  అశ్విన్ ఇంట్లో ఉండటం ఇబ్బందిగా అనిపిస్తుంది అని , బయటకు వెళ్లి ఆడాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా తన ఇంటికి పరిమితం అయిన ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఇంట్లో ఉండటం వలన బాధపడుతున్నాను అని బయటకు వెళ్లి ఆడుకోవాలనుకుంటున్నాను అని తెలిపాడు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా ఇతర భారత క్రికెటర్ల మాదిరిగా అశ్విన్ మార్చి 25 నుండి బయటకు వెళ్లి ప్రాక్టీస్ చేయలేకపోయాడు. ''మొదట్లో నేను బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు నేను నిజంగా బాధపడుతున్నాను , నేను బయటకు వెళ్లి ఆడుకోవాలనుకుంటున్నాను, లేదా అలాంటిదే చేయాలనుకుంటున్నాను, నేను ఇంటి లోపల నిజంగా ఇబ్బందిగా అనిపిస్తుంది" అని అశ్విన్ సోషల్ మీడియా లైవ్ లో చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఓ దేశ వ్యాప్తంగా సడలింపులు అనుమతిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక జులై లో క్రీడలు పునః ప్రారంభమవుతాయి అని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.