ఎన్నికలొస్తేనే.. ఆయనకు బీసీలు గుర్తుకువస్తారు

ఎన్నికలొస్తేనే.. ఆయనకు బీసీలు గుర్తుకువస్తారు

ఏపీ సీఎం చంద్రబాబుపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. ఎన్నికలొస్తేనే ఆయనకు బీసీలు గుర్తుకు వస్తారని, ఎన్నికలు అయిపోగానే బీసీలను అణగదొక్కే పనిలో ఉంటాడని ఆరోపించారు. చిత్తూరులో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు బాగోతం ఈ ఎన్నికల్లో బట్టబయలు కాబోతోందని ఆరోపించారు. బీసీలకు అండదండగా ఉన్న ఎన్టీఆర్ నుంచి పదవిని చేజిక్కించుకున్నారని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలు ఒక్క రోజు కూడా నిరహారదీక్షకు కూర్చోకూడదంటూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన ఇంకో ఐదేళ్లు బతికి ఉంటే బీసీల బతుకులు బాగుపడేవని తెలిపారు. ఈ ఎన్నికల్లో మనం జగన్ కు మద్ధతిస్తేనే.. మన పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆర్. కృష్ణయ్య అన్నారు.