'బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో రిట్‌ పిటిషన్..'

'బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో రిట్‌ పిటిషన్..'

బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య... బీసీ రిజర్వేషన్లు తగ్గింపునకు నిరసనగా హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో తెలంగాణ జనసమితి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ... బీసీలకు 34 శాతం నుండి 22 శాతానికి రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించిందని గుర్తు చేసిన కృష్ణయ్య... బీసీల మీద కక్షతోనే కేసీఆర్ రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించారు. జాతిని అమ్ముకుని టీఆర్ఎస్ బీసీ లీడర్లు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన... బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గడంతో 1500 మంది బీసీ నేతలు సర్పంచ్‌లు అయ్యే అవకాశాన్ని కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కృష్ణయ్య.