కేసీఆర్‌ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు..

కేసీఆర్‌ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు..

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ఆదరిస్తారన్నారు సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి... ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలన చూసి ప్రజలు టీఆర్ఎస్‌కు 88 సీట్లు ఇచ్చారని.. ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అదించాలని కేసీఆర్ ను కోరానన్న నారాయణమూర్తి... తెలంగాణను భారతదేశంలో నంబర్ వన్ చేయాలని కోరానని... దేశంలో ఉత్తర భారతం పెత్తనం పెరిగింది.. దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ సేవలు అవసరం అన్నారు. భారత పౌరుడిగా కేసీఆర్... ఏపీ సహా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చన్న ఆయన... చంద్రబాబు, కేసీఆర్ మంచి మిత్రులు అని అభిప్రాయపడ్డారు.