అబ్బాయిలు కూడా ముద్దొస్తారు... రాశీఖన్నా !

అబ్బాయిలు కూడా ముద్దొస్తారు... రాశీఖన్నా !

బబ్లీ లుక్ తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ రాశీఖన్నా.  మొదటి సినిమా 'ఊహలు గుసగుసలాడే' నుండి ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటూ వస్తున్న ఈమె 'తొలిప్రేమ' చిత్రంతో తనలోని నటిని పూర్తిగా ఎలివేట్ చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఈమె నటిస్తున్న కొత్త సినిమా 'శ్రీనివాస కళ్యాణం'.  సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడు.  ఈ చిత్ర టీజర్ కొద్ది గంటల క్రితమే విడుదలైంది.  టీజర్లో రాశీఖన్నా అందంగా కనిపించడమే గాక అబ్బాయిలకు అమ్మాయిలే ముద్దొస్తారా.. అమ్మాయిలకు అబ్బాయిలు రారా.. అంటూ చెప్పిన క్యూట్ డైలాగ్ యూత్ ఆడియన్సుకు బాగా కనెక్ట్ అయింది.  

దీంతో సినిమాపై అంచనాలు కూడ ఒకింత పెంచడమే కాక ఈసారి కూడ రాశీఖన్నాకు మంచి పాత్రే దొరికినట్టుందని అంటున్నారంతా.  దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలకానుంది.